calender_icon.png 10 May, 2025 | 5:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలు స్వశక్తి తో ముందుకెళ్లాలి

09-05-2025 07:33:55 PM

తహసీల్దార్ లాలునాయక్, ఎంపీడీఓ వెంకటేశ్వర్ రావు

పెన్ పహాడ్: మహిళలు స్వసక్తితో ముందుకి వెళ్ళినప్పుడే సమాజంలో మంచి గుర్తింపు పొందుతారని తహసిల్దార్ లాలునాయక్, ఎంపీడీవో వెంకటేశ్వర్ రావు అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల కేంద్రంలో  ఇందిరా మహిళా శక్తి ఆధ్వర్యంలో సంఘ బంధం సహకారంతో ఏర్పాటు చేసిన 'నారి టీ స్టాల్' ను వారు ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..మహిళలు సాధికారత దిశగా స్వశక్తితో ఎదగాలని వారు కోరారు. మహిళలు తమ అభివృద్ధి లక్ష్యంగా సంఘబంధాల సహకారం తో రుణం తీసుకున్నట్లయితే సకాలంలో రుణం చెల్లించి ఇతరులకు సహకరించాలని అన్నారు.   ఈ కార్యక్రమం లో ఏపీఎం అజయ్ నాయక్,  లబ్ధిదారులు మేకల రమణ, ఈసీ ఏకస్వామి, సెర్ఫ్ సిబ్బంది స్వరూప, పద్మావతి, ఆశ, లత, జ్యోతి, విజయ,పౌల్, సైదులు, హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.