09-05-2025 07:28:32 PM
తాడ్వాయి,(విజయక్రాంతి): రైతులు రైతు కార్డుల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఏఈఓ శివ చైతన్య తెలిపారు కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్ర పహాడ్ గ్రామంలోని రైతు వేదికలో శుక్రవారం ఆయన రైతుల రిజిస్ట్రేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులు ఆధార్ కార్డు ఫోన్ నెంబరు తీసుకొని వచ్చి తమ కార్డుల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఎర్ర పహాడ్ క్లస్టర్ పరిధిలో మొత్తం 3100 మంది రైతులు ఉండగా ఇప్పటివరకు 200 మంది రైతుల రిజిస్ట్రేషన్ పూర్తి చేసినట్లు తెలిపారు రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్డును అందించనున్నట్లు తెలిపారు. ఆధార్ కార్డులు ఎలా ఉంటాయో రైతుల గుర్తింపు కార్డులు సైతం అలాగే ఉంటాయని ఆయన తెలిపారు