calender_icon.png 10 September, 2025 | 1:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇసుక ట్రాక్టర్ ను పట్టుకున్న మైనింగ్ అధికారులు

09-09-2025 08:51:30 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం నుండి బెల్లంపల్లికి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ ను మంగళవారం సాయంత్రం కన్నాల జాతీయ రహదారి వద్ద మైనింగ్ అధికారులు(Mining Authorities) చాకచక్యంగా పట్టుకున్నారు. ఇసుకతో ఉన్న ట్రాక్టర్ ను వారు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇసుక ట్రాక్టర్ ను పట్టుకున్న వారిలో మైనింగ్ అధికారులు రామ్, సురేష్, నరేష్ లు ఉన్నారు.