calender_icon.png 10 September, 2025 | 2:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన జనగామ ఎమ్మెల్యే పల్లా

09-09-2025 08:54:31 PM

కొమురవెల్లి దేవస్థానంను మాస్టర్ ప్లాన్లో చేర్చాలి..

మా హయాంలో ఏనాడూ యూరియా కోసం రైతు రోడ్డు ఎక్కలేదు..

చేర్యాల: మంగళవారం నాడు చేర్యాల పట్టణం చేర్యాల కొమురవెల్లి మద్దూరు దులిమిట్ట మండలాలకు చెందిన 57 మంది లబ్దిదారులకు 13.50లక్షల రూపాయల చెక్కులను జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి(MLA Palla Rajeshwar Reddy) అందజేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, కొమురవెల్లి దేవస్థానంను మాస్టర్ ప్లాన్లో చేర్చాలని లేని పక్షంలో మల్లన్న భక్తులతోని కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చెప్పడతామని అలాగే ఆలయ ఈవో లను వారానికి ఒకరి చొప్పున అది కూడా ఇంచార్జిలను నియమించడం ద్వారా ఆలయ అభివృద్ధి కుంటుపడుతుందని ఆలయానికి ఇప్పటికి కూడా పూర్తి స్థాయి పాలకమండలి లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. అలాగే రైతులకు యూరియా అందక అవస్థలు పడుతున్నారని నేను రైతు సమితి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సీజనకు ఎంత కావాలో అంత కేంద్రం నుంచి ముందుగాలనే తెప్పించి యూరియా కొరత రాకుండా చూశామని గుర్తు చేశారు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మొద్దు నిద్ర పోవడంవల్లే రైతులకు ఈ పరిస్థితి వచ్చింది అని అన్నారు.