23 April, 2026 | 5:11 PM

Breaking News

అధికారంలోకి వచ్చాక విస్మరించడం తప్పు... జగ్గారెడ్డి సంచలన పోస్ట్   •   ఆర్టీసీ సమ్మెలో ఉద్రిక్తత.. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ఆర్టీసీ డ్రైవర్   •   వన్యప్రాణుల క్రమ శిక్షణ   •   ఏటీఎంలో వ్యక్తి మృతదేహం.. మసబ్ ట్యాంక్‌లో కలకలం   •   3 గంటల వరకు తమిళనాడులో 70%, బెంగాల్‌లో 78.77% పోలింగ్‌ నమోదు   •   కాళేశ్వరంపై కాంగ్రెస్, BRS కుమ్మక్కయ్యాయి   •   అకాల వర్షంతో తడిసిన వడ్లు – ప్రభుత్వానికి రైతుల విజ్ఞప్తి   •   ద్రోణి, క్యుములోనింబస్ మేఘాల ప్రభావం.. హైదరాబాద్‌కు వర్ష సూచన   •   ఆన్‌లైన్ నమోదు తప్పనిసరి   •   పోలీసుల ఆంక్షల మధ్య రెండో రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె   •  

మంత్రి అడ్లూరికి తప్పిన ప్రమాదం

29-06-2025 12:57 AM
  1. ఊడిన కారు చక్రాలు 

మెట్‌పల్లి మండలం అరపేట్‌లో ఘటన

జగిత్యాల, జూన్ 28 (విజయక్రాంతి): రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు తృటిలో రోడ్డు ప్రమాదం తప్పింది. శనివారం జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో జరి గిన పలు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నా రు.

రాత్రి తిరుగు ప్రయాణంలో మెట్‌పల్లి మండలం అరపేట్ శివారులో మంత్రి అడ్లూరి ప్రయాణిస్తున్న కారు ముందు చక్రా లు ఊడిపోయాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకపోవడంతో అధికారులు, నాయకులు ఊపి రి పీల్చుకున్నారు. మరో వాహనంలో మం త్రి లక్ష్మణ్ కుమార్ వెళ్లిపోయారు.