దేవాలయ అభివృద్ధికి కృషి
- ఆర్యవైశ్య పేదలకు అండగా ఉంటాం
- వాసవి మాత జయంతి ఉత్సవాలో మంత్రి
నల్లగొండ టౌన్, ఏప్రిల్ 26 :దేవాలయ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు ఆదివారం పట్టణంలోని బీట్ మార్కెట్ రామకోటి స్తూప దేవాలయం,గాంధీ పార్క్లో నిర్వహించిన వాసవి మాత జయంతి ఉత్సవాల్లో మంత్రి పాల్గొని వాసవి మాతకు ప్రత్యేక పూజ నిర్వహించిన అనంతరం ఆయన భక్తులను ఉద్దేశించి మాట్లాడారు వాసవి మాత ఆశీర్వాదంతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఆర్యవైశ్య సమాజానికి ఎలాంటి సమస్యలు ఉన్నా, ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన వారికి అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు.రామకోటి స్తూప దేవాలయ అభివృద్ధికి సహకారం అందించినట్లు తెలిపారు. దేవాలయ విస్తరణకు అవసరమైన స్థలాన్ని కూడా సమకూర్చేందుకు కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, పలువురు కౌన్సిలర్లు, ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు.






