1 August, 2026 | 9:52 PM

అన్ని కార్టన్ బాక్సులపై జీఎస్టీని తగ్గిస్తాం : ఆర్ధికమంత్రి నిర్మలా

22-06-2024 07:23 PM

న్యూఢిల్లీ : సాధారణ బడ్జెట్ కోసం సన్నాహాలు ప్రారంభించిన కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులతో చర్చించారు. జీఎస్టీ కౌన్సిల్ 53వ సమావేశం ముగిసిన అనంతరం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా సమావేశం నిర్వహించారు. జీఎస్టీ కౌన్సిల్ గత సమావేశం అక్టోబర్ లో జరిగిందని, ఎన్నికల వల్ల చాలా రోజులుగా జీఎస్టీ కౌన్సిల్ భేటీ జరగలేదన్నారు.

ఇవాళ జరిగిన సమావేశంలో చాలా అంశాలపై చర్చించమని, బడ్జెట్ సమావేశాల తర్వాత జరితే సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో సెక్షన్ 73 కింద విధించే జరిమానాలపై ప్రధానంగా చర్చించినట్లు వెల్లడించారు. జరిమానాలపై వేస్తున్న వడ్డీని ఎత్తివేయాలని ప్రతిపాదనాలు వచ్చాయని, జీఎస్టీపై ట్రైబ్యునళ్లు, కోర్టులకు వెళ్లే లావాదేవీల పరిమితిని పెంచినట్లు ఆర్థిక మంత్రి చెప్పారు. యాపిల్, ఇతర పండ్ల వ్యాపారులకు మేలు కలిగేలా అన్ని కార్టన్ బాక్సులపై జీఎస్టీని తగ్గించాలని, స్ప్రింకర్లపై12 శాతం, సోలార్ కుక్కర్లపై కూడా  12 శాతం జీఎస్టీని తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.