30-12-2025 10:24:13 AM
సంగారెడ్డి,(విజయక్రాంతి): వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి పట్టణంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం వైకుంఠపురం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు ఆలయంలోని ఉత్తర ద్వారం గుండా స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారి పల్లకి సేవలో భక్తులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వైకుంఠపురం క్షేత్ర అభివృద్ధికి, రాజగోపురం నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.