1 June, 2026 | 2:42 AM

మంత్రి దామోదర్ సుడిగాలి పర్యటన

01-06-2026 02:12 AM

పలు అభివృద్ధి పనుల పర్యవేక్షణ 

మునిపల్లి, మే31: మునిపల్లి మండలంలో రాష్ట్ర ఆరోగ్యశాఖా మంత్రి దామో దర రాజనర్సింహ్మ ఆదివారం సుడిగాలి పర్యటన చేశారు. బుదేరాలోని మహిళా డిగ్రీ కళాశాలలో అకాడమిక్ బ్లాక్ బిల్డింగ్ నిర్మా ణం కోసం స్థలం,   లింగంపల్లి గురుకుల పాఠశాల,  జూనియర్ కాలేజ్ లలో  నూతనంగా నిర్మించే ప్రతిపాదిత స్కూలు భవన నిర్మాణ స్థలాన్ని,  కంకోల్ రోడ్డు టోల్ గేట్ దగ్గర తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో ప్రతిపాదిత  టూరిజం హోటల్ , కన్వెన్షన్ సెంట ర్ నిర్మాణ స్థలం,  గార్లపల్లి - తక్కలపల్లి గ్రా మాల మధ్య నిర్మిస్తున్న హై లెవెల్ బ్రిడ్జి పనులను మంత్రి పరిశీలించారు.   పర్యటనలో భాగంగా సింగూరు ప్రాజెక్టు డ్యాం బ్యాక్ వాటర్ గ్రామాలను అనుసంధానం చే సే రోడ్డు, బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు. 

ఈ పర్యటనలో  మక్తక్యాసారం నుం డి రాయికోడ్ మండలంలోని హస్నాబాద్, బొగ్గులంపల్లి,  కర్చల్ , సింగీతం గ్రామాల మీదుగా నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు.  ఈ పర్యటనలో ము నిపల్లి మండలం బుధేరాలోని  సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో సుమారు 6 కోట్ల 80 లక్షలతో నూతనంగా నిర్మించ తలపెట్టిన అకడమిక్ బ్లాక్  నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. సాంఘీక సంక్షేమ శాఖ గురుకుల సొసైటీ నిధులతో పాటు ఎంఆర్ ఎఫ్  సంస్థ  సహకారంతో సీఎస్‌ఆర్ నిధులతో ఈ అకడమిక్ బ్లాక్ ను నిర్మిస్తున్నామన్నారు.

అలాగే  కంకోల్ రోడ్డు టోల్ గేట్ వద్ద తెలంగాణ టూరిజం ఆధర్యంలో 3 ఎకరాల విస్తీర్ణం లో సుమారు 25 కోట్ల రూపాయలతో నిర్మించ తలపెట్టిన ప్రతిపాదిత హరిత హోటల్, కన్వెన్షన్ సెంటర్ స్థలాన్ని పరిశీలించారు.  ఈ కార్యక్రమంలో సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్  గిరిధర్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్  పాండు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రామాచారి,  కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సతీష్ కుమార్,  ఉపాధ్యక్షుడు రసూల్ పటేల్,    కాంగ్రెస్ సీనియర్ నాయకులుబుర్కల పాం డు,  సంగన్న, మక్సూద్ పటేల్, వెంకట్రాములు, విజయ్ కుమార్, డిప్యూటీ  ఎమ్మా ర్వో ప్రదీప్,  సర్పంచులు ఆనంద్, ఈశ్వరప్ప, నారాయణ, వీరేశం,  బడ్డ మల్లేశం, నాయకులు తదితరులు పాల్గొన్నారు.