ఘనంగా రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు
ముత్తారంలో కేక్ కట్ చేసి, పండ్లు, మజ్జిగ పంపిణీ చేసిన కాంగ్రెస్ శ్రేణులు
ముత్తారం,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సమాచార సాంకేతిక ఐటీ పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలను ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు శనివారం అత్యంత ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో భాగంగా నియోజకవర్గ ప్రజలకు, కార్మికులకు వివిధ సేవా కార్యక్రమాలను చేపట్టారు.
కేక్ కటింగ్, మజ్జిగ పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు
ముత్తారం మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి కేక్ కట్ చేశారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు, బాటసారులకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు.
ముత్తారం ఆసుపత్రిలో పండ్ల పంపిణీ
అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి, అక్కడ చికిత్స పొందుతున్న రోగులకు పండ్లను పంపిణీ చేసి వారి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అడవి శ్రీరాంపూర్ లో కూలీలతో కలిసి వేడుకలు
అడవి శ్రీరాంపూర్ గ్రామంలో జరుగుతున్న '100 రోజుల ఉపాధి హామీ' పనుల వద్దకు కాంగ్రెస్ నాయకులు వెళ్లారు. అక్కడ ఉపాధి కూలీల సమక్షంలో కేక్ కట్ చేసి, వారికి మజ్జిగ ప్యాకెట్లను అందించి కాసేపు వారితో ముచ్చటించారు. మంత్రి శ్రీధర్ బాబు నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసం తపించే నాయకుడని, వారు ఆయురారోగ్యాలతో వర్ధిల్లి, ప్రజాసేవలో ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నమన్నారు.






