25 July, 2026 | 10:25 PM

Breaking News

ఓటర్ల జాబితా ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాం   •   డ్యూటీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్   •   అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి   •   జనగణన హ్యాండ్‌బుక్‌కు ఖచ్చితమైన సమాచారం సేకరించాలి   •   జలసిరి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి   •   విద్యార్థుల పోరాటానికి దక్కిన చారిత్రక విజయం   •   ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు సిద్ధం కావాలి   •   బీఆర్ఎస్ నాయకుడికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాళి   •   ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం   •   ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేయడం విద్యార్థుల విజయం   •  

బూత్ స్థాయి నుంచే కాంగ్రెస్ బలోపేతం

30-05-2026 04:25 PM

నిజాంసాగర్,(విజయక్రాంతి): బూతు స్థాయి నుండి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని  నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రజాపండరి కోరారు. ఆయన శనివారం నాడు నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బూత్ లెవల్ ఏజెంట్లు (BLA) సభ్యులతో ముఖ్య సమావేశం నిర్వహించారు. సమావేశంలో పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయడం, బూత్ కమిటీలను సమర్థవంతంగా నిర్వహించడం, ఓటర్ల వివరాల పరిశీలన, కొత్త సభ్యత్వ నమోదు, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. మండలంలోని ప్రతి బూత్‌లో కాంగ్రెస్ పార్టీని మరింత పటిష్టం చేయాలని, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. బీఎల్‌ఏ సభ్యులు తమ అభిప్రాయాలు, సూచనలను వెల్లడించగా, పార్టీ బలోపేతానికి అవసరమైన మార్గదర్శకాలను అందించారు.