13 June, 2026 | 7:27 PM

రక్తదానం చేయండి... ప్రాణదాతలుగా నిలవండి

13-06-2026 06:05 PM

ముకరంపుర,(విజయక్రాంతి): నేడు ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా గాలి పెల్లి కుమార్ 55వ సారి రక్తదానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఆపదలో ఉన్న వారికి  అండగా నిలుస్తూ. 55 సార్లు రక్తదానం చేసి 8000 మంది ప్రాణాలను కాపాడిన రక్తదాత గాలిపెల్లి కుమార్ యువతకు ఆదర్శప్రాయుడు .కరీంనగర్ బొమ్మకల్ కి చెందిన గాలిపెల్లి అంజమ్మ దుర్గయ్య ల కుమారుడు గాలిపెల్లి కుమార్.. ప్రాణాపాయ స్థితుల్లో కొట్టుమిట్టా డుతున్న అనేక మందికి రక్త దానం చేస్తూ చేయిస్తూ తన మిత్రులతో తోటి వారితో చేయిస్తూ ఎందరో ప్రాణాలు నిలుపుతున్నాడు.అలాగె 120 మందికి పైగా కోవిడ్ వాళ్లకు ప్లాస్మా అందించి ప్రాణాలు కాపాడారు.