పర్యటక భవన్‌లో మంత్రి జూపల్లి ఆకస్మిక తనిఖీ
20-06-2024 01:28 PM
హైదరాబాద్: రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం పర్యాటక భవన్ లో ఆకస్మిక తనిఖీలు చేశారు. సిబ్బంది సమయపాలన పాటించకపోవడంపై మంత్రి జూపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల హాజరుశాతం తక్కువగా ఉండటంపై మంత్రి మండిపడ్డారు. ఉద్యోగుల గత 12 నెలల హాజరు వివరాలు ఇవ్వాలన్నారు. అందరికీ బయోమెట్రిక్ విధానం అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.






