8 August, 2026 | 1:44 PM

వెల్గొండలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

08-08-2026 12:39 PM

ధర్మపురి,ఆగస్టు8(విజయక్రాంతి): జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం వెల్గొండ గ్రామంలో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా సి.సి. (సిమెంట్ కాంక్రీట్) రోడ్డు నిర్మాణ పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి. గ్రామంలోని అంతర్గత రహదారుల అభివృద్ధి కోసం సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సహకారంతో రూ. 10 లక్షల అంచనా వ్యయంతో ఈ పనులను చేపట్టనున్నారు. బుధవారం గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో స్థానిక గ్రామ సర్పంచ్ నీలం నందిని సంతోష్ లతో కలిసి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నగునూరి నర్సగౌడ్ కొబ్బరికాయ కొట్టి, భూమిపూజ చేసి ఈ పనులను అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు యువకులు పాల్గొన్నారు.