నీట్ పరీక్షల అవకతవకలపై కేంద్రం స్పందించాలి: మంత్రి శ్రీధర్ బాబు
20-06-2024 01:57 PM
హైదరాబాద్ : నీట్ పరీక్షకు సంబంధించిన అవకతవకలపై కేంద్రం స్పందించాలని రాష్ట్ర ఐటిశాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. సీఎల్పీ కార్యాలయంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... పరీక్ష నిర్వహణకు సంబంధించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 63 మందికి ఒకటే ర్యాంక్ వచ్చిందన్న మంత్రి విద్యార్థులకు అన్యాయం జరగకూడదని కాంగ్రెస్ ప్రభుత్వం తరుఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో విఫలమైందని ఆరోపించారు. సీబీఐతో విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం తరుఫున కోరుతున్నామని చెప్పారు.






