22 March, 2026 | 1:01 PM

అమెరికాకు మంత్రి కోమటిరెడ్డి

06-08-2024 02:42 AM

హైదరాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తో కలిసి గురువారం అమెరికాలో ప్రవాస భారతీయ ప్రముఖులతో జరుగనున్న ‘మీట్ అండ్ గ్రీట్’కు హాజరయ్యేందుకు సోమవారం రాష్ట్ర ఆర్‌అండ్‌బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బయల్దేరి వెళ్లారు.

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులను వేగవంతం చేసేందుకు సైతం మంత్రి ఈ పర్యటనను సద్వినియోగం చేసుకుంటారని సమచారం. పనులు పూర్తి చేసేందుకు అధునాతన బేరింగ్ మెషినరీ సమకూర్చేందుకు 12న ఓహియోలోని రాబిన్స్ టన్నెల్ బోరింగ్ మెషినరీ మ్యాన్‌ఫ్యాక్చరింగ్ కంపెనీ సీఈవో లాక్ హోమ్‌తో ఆయన సమావేశమవుతారు.