పేద ముస్లింలకు ఇళ్లు కట్టిస్తాం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
హైదరాబాద్: బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. బక్రీద్ ప్రత్యేక ప్రార్థనల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. బక్రీద్ పండగ అంటేనే త్యాగాలకు ప్రతీక అని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా పేద ముస్లింలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీపి కబురు చెప్పారు. పేద ముస్లింలకు ఇళ్లు కట్టిస్తామని వెల్లడించారు. ముస్లింలకు విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పిస్తామని పేర్కొన్నారు. ''త్యాగం, కరుణకు, భక్తికి, విశ్వాసానికి, ఐక్యతకు సంకేతమైన బక్రీద్ పండగ సందర్భంగా నా ఆత్మీయ ముస్లీం సోదరులందరికి శుభాకాంక్షలు.అల్లా అనుగ్రహం, మహ్మద్ ప్రవక్త ఆశీస్సులు తెలంగాణ ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.'' అని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు.






