calender_icon.png 7 July, 2025 | 4:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటన

07-07-2025 12:00:00 AM

కామారెడ్డి, జూలై 06 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లాలో సోమవారం రాష్ట్ర రోడ్డు భవనాల సినిమా టోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆయన పర్యటన సందర్భంగా కామారెడ్డి జిల్లాలో ఉదయం 11:40 గంటలకు జుక్కల్ నియోజకవర్గంలో మద్దెల చెరువు నుండి పిట్లం రోడ్డు తిమ్మానగర్ వద్ద 4.86 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన హై లెవెల్ బ్రిడ్జి ను ప్రారంభిస్తారు.

మధ్యాహ్నం 12 10 గంటలకు బిచ్కుంద నుండి డోంగ్లి వరకు 13.20 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే రోడ్డు పనులకు శంకుస్థాపన. మధ్యాహ్నం 12:30 కు స్థానిక ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు జిల్లా ప్రజాప్రతినిధులు సీనియర్ నాయకులతో కలిసి పబ్లిక్ మీటింగ్లో పాల్గొంటారు.

మధ్యాహ్నం ఒంటిగంటకు రాష్ట్ర ప్రభుత్వము మళ్ళీ చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ పథకాలపై జిల్లా కలెక్టర్ పలువురు జిల్లా ఉన్నతాధికారులతో జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంట 45 నిమిషాలకు ఇటీవల అకాల మరణం చెందిన సీనియర్ జర్నలిస్టు దత్తు రెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం తిరిగి హైదరాబాద్ వెళ్తారు.