calender_icon.png 7 July, 2025 | 9:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మిక హక్కులను పరిరక్షించాలి

07-07-2025 12:00:00 AM

సీపీఎం జిల్లా కార్యదర్శి రాజన్న

కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 6 (విజయక్రాంతి): కార్మికుల హక్కులను పరిరక్షిం చాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రాజన్న అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో తమ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాల ను తీవ్రంగా ఖండిస్తూ కార్మికుల హక్కులను కాలరాసే నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 9న నిర్వహించే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించా రు.

పెట్టుబడిదారులకు అనుకూలంగా బిజె పి ప్రభుత్వం  వ్యవహరిస్తుందని ఆరోపించారు.ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ తో ఉద్యోగ భద్రత ,యూనియన్ హక్కులు ,వేతన హామీలు, సామాజిక భద్రత ఇలా అనేక అంశాలను నిర్వీర్యం చేస్తున్నాయని తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు దుర్గం దినకర్, జిల్లా కమిటీ సభ్యుడు  గొడిసెల కార్తీక్ పాల్గొన్నారు.