07-07-2025 12:00:00 AM
టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 6 (విజయక్రాంతి): జర్నలిస్టులు ఐక్యంగా ముందు కు సాగాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం (టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఏ రోజ్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో ఆసిఫాబాద్ డివిజన్ ఎలక్ట్రానిక్ మీడియా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా టీ యూడబ్ల్యూజే (ఐజేయూ ) జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్ మాట్లాడుతూ జర్నలిస్టులు అందరూ ఒక కుటుంబ సభ్యులేనని, ఎలాంటి విభేదాలు లేకుండా అందర్నీ కలుపుకొని పోవాలని, ఐక్యతతో ముందుకు సాగాలని నూతన కార్యవర్గాన్ని సూచించా రు. టీయూడబ్ల్యూజే (ఐజేయు) జర్నలిస్టుల సంక్షేమం కొరకు పాటుపడుతుందని తెలిపారు.
జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ కోసం పాటుపడాలని నూతన కార్యవర్గాన్ని సూచించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఎలక్ట్రానిక్ మీడియా కార్యవర్గాన్ని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ప్రింట్ మీడియా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఎస్ వేణుగోపాల్ , వారణాసి శ్రీనివాస్, జి ల్లా స్టాఫ్ రిపోర్టర్‌లు హనమయ్య, రామ్మోహన్, చిప్ప సురేష్ మాట్లాడారు.
నూతన కార్యవర్గానికి సన్మానం
ఆసిఫాబాద్ డివిజన్ ఎలక్ట్రానిక్ మీడి యా ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడు కొండపల్లి సాయికుమార్, ఉపాధ్యక్షులు వోరగంటి సంతోష్, ప్రధాన కార్యదర్శిగా అనిశెట్టి సదాశివ్, సంయుక్త కార్యదర్శిగా శివ, కోశా ధికారిగా మహాత్మ భీం రావు, ప్రచార కార్యదర్శిగా విజయ్ కుమార్,గౌరవ అధ్యక్షులుగా రాజ్ కుమార్,గౌరవ సలహాదారులుగా సహరె రాజు,వెంకేశ్వర్లు,సురేష్, రమేష్ ఎన్నికైన సందర్భంగా వీరికి శాలువతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా అక్రిడేషన్ కమిటీ మెంబర్ ప్రకాష్‌గౌడ్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి సాయి , సదాశివ్ , జర్నలిస్టు సంఘ నాయకులు శ్రీను, రమేష్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.