07-07-2025 10:39:45 AM
హైదరాబాద్: జీవ వైవిధ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) తెలిపారు. చెట్లు నాటి వాటిని రక్షిస్తేనే మానవాళికి మనుగడ ఉంటుందని చెప్పారు. మనం చెట్లు నాటితే మన తర్వాత తరాలకు కూడా ఉపయోగం ఉంటుందని కొండా సురేఖ వెల్లడించారు. వన మహోత్సవాన్ని ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని మంత్రి సురేఖ పిలుపునిచ్చారు. నేటి నుంచి తెలంగాణ వన మహోత్సవం కార్యక్రమం ప్రారంభం అయింది. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 18.03 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు.