calender_icon.png 7 July, 2025 | 12:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైల్డర్‌నెస్ రిసార్ట్‌పై కేసు నమోదు

07-07-2025 09:53:32 AM

హైదరాబాద్: వికారాబాద్ జిల్లాలోని వెల్డర్ నెస్ రిసార్ట్(Wilderness Resort) పై సోమవారం కేసు నమోదైంది. మొన్న సర్పన్ పల్లి ప్రాజెక్టులో బోటింగ్ కు వెళ్లి ఇద్దరు మహిళలు మృతి చెందారు. మహిళల మృతికి రిసార్ట్ యాజమాన్యమే కారణమని కేసు నమోదైంది. వెల్డర్ నెస్ రిసార్ట్ యాజమాన్యం అక్రమంగా బోటింగ్ నిర్వహిస్తుంది. కనీస భద్రతా చర్యలు పాటించని రిసార్ట్ యాజమాన్యంపై(wilderness Resort management) బీఎన్ఎస్ 106(1) సెక్షన్ కింద వికారాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. వికారాబాద్‌లోని సర్పన్‌పల్లి సరస్సులో మునిగిపోయిన ఇద్దరు మహిళల మృతదేహాలను ఆదివారం వెలికితీసి మార్చురీకి తరలించారు. మృతులను బీహార్‌కు చెందిన రితిక (44), పూనమ్ (50)గా గుర్తించారు. ఈ మహిళలు తమ కుటుంబంతో కలిసి వికారాబాద్‌లోని ఒక రిసార్ట్‌కు వచ్చారు.