20-06-2025 12:32:51 AM
- పెద్దకొత్తపల్లి మండలం జొన్నలబొగుడలో ఘటన.
నాగర్ కర్నూల్ జూన్ 19 (విజయక్రాంతి) నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం జొ న్నలబొగుడ గ్రామంలోని ప్రభుత్వ పాఠశా లలో చదివే విద్యార్థులు, గ్రామస్తులంతా ఊళ్లోకి వచ్చే ప్రైవేటు పాఠ శాల బస్సులను అడ్డుకున్నారు. తమ ఊర్లో సర్కార్ బడి ఉన్నది మా ఊరి పిల్లలు అంతా అందులోనే చదువుతున్నారు.
ప్రైవేటు పాఠశాల బస్సు మా ఊర్లోకి రావొద్దంటూ బుధవారం లిటిల్ బరడ్స్ అనే ప్రైవేట్ స్కూల్ బస్సును నిలిపి వాదనకు దిగారు. దీంతో గ్రామంలో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గ్రామస్తులంతా ముక్తకంఠంతో చెప్పడంతో చేసేది లేక ప్రైవేట్ పాఠశాల బస్సు తిరిగి వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితిఏర్పడింది.