విద్యార్థులచే ప్రతిజ్ఞ
22-04-2026 04:14 PM
నిర్మల్,(విజయక్రాంతి): జిల్లా విద్యాశాఖ నేషనల్ గ్రీన్ కోర్స్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ నిర్వహించారు. పట్టణంలోని పలు ప్రభుత్వ పాఠశాలలో చైతన్య కార్యక్రమం నిర్వహించారు. భూ పరిరక్షణ ప్లాస్టిక్ నియంత్రణ పర్యావరణ పరిరక్షణ మొక్కల పెంపకం తదితర అంశాన్ని ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా గుర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పరమేశ్వర్ మోహన్రావు సిబ్బంది పాల్గొన్నారు.






