11 April, 2026 | 1:42 AM

విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తున్న ప్రజా ప్రభుత్వం

11-04-2026 12:14 AM
  1. రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
  2. కూసుమంచి మండలానికి చెందిన 191 మందికి మొత్తం 58 లక్షల 58 వేలు సి.ఎం.ఆర్.ఎఫ్. చెక్కులు పంపిణీ
  3. పేదవాళ్లకు పూర్తిగా అండగా ఉంటూ వైద్యానికి గతంలో కంటే రెట్టింపు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం
  4. కూసుమంచి మండల లబ్ధిదారులకు సి.ఎం.ఆర్.ఎఫ్. చెక్కులను అందజేసిన మంత్రి పొంగులేటి

కూసుమంచి, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): విద్యకు, వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తూ ఎక్కువ నిధులు వెచ్చిస్తున్నదని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. శుక్రవారం కూసుమంచి క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సిపి సునీల్ దత్ లతో కలిసి కూసుమంచి  మండలానికి చెందిన 191 మందికి మొత్తం 58 లక్షల 58 వేలు సి.ఎం.ఆర్.ఎఫ్. చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో వైద్యానికి, విద్యకు పెద్దపీట వేయడమే కాకుండా ప్రతి పేదవానికి భరోసా కల్పించి ఆరోగ్య విషయంలో ఎవరికైనా అనారోగ్యం కలిగిన సందర్భంలో పూర్తిగా అండగా ఉండి ఎన్ని కోట్లు ఖర్చు అయినా వెనకడుగు వేయకుండా వెచ్చిస్తున్నదని, రాష్ట్ర వ్యాప్తంగా గతంలో కంటే రెండు రెట్లు అదనంగా పేదలకు భారం కాకుండా వైద్యానికి ఖర్చు చేస్తూ పేదలకు అండగా ప్రభుత్వం నిలుస్తున్నదని, ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్న వారికి చేయూత అందిస్తూ సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేస్తున్నట్లు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో ఏదులాపురం మునిసిపల్ చైర్ పర్సన్ పోకబత్తిని అనిత, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, జిల్లా అధికారులు, ఖమ్మం ఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్ సైదులు, ఎంపీడీఓ, వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, వివిధ శాఖల అధికా రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.