11 April, 2026 | 2:08 AM

ఎర్రుపాలెం రైల్వే స్టేషన్‌కు మహర్దశ..

11-04-2026 12:12 AM

జంక్షన్ గా మారే అవకాశం

డిప్యూటీ సీఎం చొరవతో మరింత అభివృద్ధి 

హర్షం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల ప్రజలు

ఎర్రుపాలెం ఏప్రియల్ 10 (విజయక్రాంతి): ఎర్రుపాలెం రైల్వే స్టేషన్ కు మహర్దశ రానున్నది. చిన్న తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం జమలాపురం ఎర్రుపాలెం మండలంలో ఉన్నది. అంతటి పేరుగాంచిన దేవస్థానం కు సుదూర ప్రాంతాల నుండి రావాలంటే ఎర్రుపాలెం రైల్వే స్టేషన్ కు రావలసి ఉంటుంది. ఎర్రుపాలెం రైల్వే స్టేషన్ తెలంగాణకు చివరి రైల్వే స్టేషన్ గా సికింద్రాబాద్, చెన్నై రైల్వే లైన్ల మధ్య లో ఈ స్టేషన్  ఉన్నది. ఈ స్టేషన్ కు ఘనమైన చరిత్ర ఉన్నది.

ప్రధానమైన వందే భారత్ వంటి సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య నడిచే రైళ్లు ఈ స్టేషన్ నుండే నడుస్తున్నాయి. కృష్ణ గోల్కొండ వంటి రైళ్లు ఈ స్టేషన్ ఆగుతున్నాయి. విశాఖపట్నం, భువనేశ్వర్, తిరుపతి, చెన్నై కేరళ వంటి సుదూర ప్రాంతాలకు అలానే ఖమ్మం వైపు సికింద్రాబాద్ హైదరాబాద్ ముంబాయి ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ వంటి ప్రాంతాలకు వెళ్లే రైళ్లు ఈ స్టేషన్ నుండే నడుస్తున్నాయి.

ఎర్రుపాలెం రైల్వే స్టేషన్ కు తెలంగాణ ప్రాంత ప్రయాణికులే కాకుండా ఆంధ్ర ప్రాంత ప్రయాణికులు కంచికచర్ల జగన్నాధపురం జుజ్జూరు అల్లూరు, పెద్దాపురం మాధవరం, జయంతి వీర్లపాడు వంటి ప్రాంతాల ప్రయాణికులు కూడా  ప్రయాణం చేయాలంటే ఈ స్టేషన్కు వచ్చి రైలు ద్వారా సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయవలసి ఉంటుంది. దీనితో ఈ స్టేషన్కు ఎంతో ఆదాయం వస్తుంది. ఆనాటి నిజాం పాలన  నుండి  నేటి ప్రభుత్వాల ఈ రైల్వే స్టేషన్ ను అభివృద్ధి పరుస్తూ వచ్చారు. ఎర్రుపాలెం రైల్వే స్టేషన్ త్వరలో జంక్షన్‌గా మారనున్నది.

ఎర్రుపాలెం రైల్వే స్టేషన్ పై విజయక్రాంతి ప్రత్యేక కథనం. ఈనాటి ఎర్రుపాలెం రైల్వే స్టేషన్ నిజాం కాలం నుండి ఘనమైన చరిత్రను కలిగి ఉన్నది. చెన్నై సికింద్రాబాద్ ప్రధాన మార్గంలో ఉన్నది. ఈ స్టేషన్ నుండి ప్రయాణికులు సికింద్రాబాద్ వైపు వెళ్లాలంటే ఈ స్టేషనుండే ప్రయాణం చేయవలసి ఉంటుంది. విశాఖపట్నం భువనేశ్వర్ వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే ఈ స్టేషన్ మార్గం నుండే వెళ్లవలసి ఉంటుంది. తిరుపతిగా ప్రసిద్ధికెక్కిన వెంకటేశ్వర స్వామి దేవస్థానం కు వెళ్లాలంటే ఈ స్టేషన్ నుండే ప్రయాణం చేయవలసి ఉంటుంది.

తమిళనాడు కేరళ వంటి రాష్ట్రాలకు చేరుకోవాలన్న ఈ స్టేషన్ నుండే ప్రయాణం చేయవలసి ఉంటుంది. తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఖమ్మం జిల్లాకు చివరి స్టేషన్ గా ఉన్నది. ఈ స్టేషన్ నుండి ఖమ్మం వైపు, ఆంధ్ర ప్రాంతం వైపు వెళ్ళుటకు ఈ స్టేషను అభివృద్ధి పరచడానికి రైల్వే శాఖ ఎన్నో నిధులను కేటాయించి. ఈ రైల్వే స్టేషన్ కు సుందరీ కరణ, అభివృద్ధి పనులను ప్రారంభించింది. అందులో భాగంగా ఫ్లాట్ ఫామ్ లను సుందరీ కరణ, అభివృద్ధి చేస్తూ ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేందుకు ప్లాట్ ఫామ్లను నిర్మిస్తుంది. ఈ పనులు ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి.

త్వరలో ఈ పనులు ముగియనున్నాయి. సుందరీకరణ అభివృద్ధి తో ఈ స్టేషన్ ఎంతో ఉపయోగంలోకి రానున్నది. అంతేకాక ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన అమరావతిని రాజధానిగా చేస్తూ ఆంధ్ర ప్రాంతం నుండి నంబూరు నుండి ఎర్రుపాలెం వరకు రైల్వే లైన్ ను మంజూరు చేసింది. దీనితో ఎర్రుపాలెం స్టేషన్ నుండే నంబూరుకు వెళ్ళవలసి ఉంటుంది. ఈ రైల్వే లైన్ నిర్మిస్తే రాబోయే రోజుల్లో ఎర్రుపాలెం రైల్వే స్టేషన్ జంక్షన్ గా మారి ఎన్నో రైళ్లు ఈ స్టేషన్లో ఆగడానికి ఉపయోగకరంగా ఉంటుంది. దీనితో ఎరుపాలెం రైల్వే స్టేషన్ కు మరిన్ని సౌకర్యాలు రానున్నాయి.

సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కష్టాలు తీరనిన్నాయి. ఎప్పటినుంచో ఈ ప్రాంత ప్రయాణికులు ఎదురుచూస్తున్న శాతవాహన, ఇంటర్ సిటీ వంటి ప్రధాన రైళ్లు ఈ స్టేషన్లో ఆగడానికి అవకాశం ఉంటుంది.  జంక్షన్ గా మారడం వలన ఈ స్టేషన్లో ఆగడానికి అవకాశం ఉంటుంది. ప్రయాణికుల కష్టాలు తీరన్నున్నాయి.దీనితో ఈ స్టేషన్ మరింత అభివృద్ధిలోకి రానున్నది ఈ ప్రాంత ప్రయాణికుల కష్టాలు తీరనున్నాయి.