6 June, 2026 | 1:39 AM

విచారణ సమగ్రంగా జరిగేనా?

06-06-2026 12:00 AM
  1. బిల్లులు కాజేశారు..మొక్కలు పీకేశారు..
  2. అటవి మొక్కలపై వరుస కథనాలు రాసిన ‘విజయక్రాంతి’ 
  3. విచారణ చేసిన డీఆర్డీఓ అడిషనల్ పీడీ 
  4. ప్రజాధనం వృధా కాకుండా చూడాలంటున్నా జనం 

మహమ్మాదాబాద్ జూన్ 5 : ఇంటి పనులే కాదు ప్రభుత్వానికి ఏ బకాయి పడిన నియమ నిబంధనలు పాటించి ఆ బకాయిలను వసూలు చేసే పనిలో ప్రభుత్వ అధికారులు నిమగ్నమై పనిచేస్తారని కొన్ని సందర్భాల్లో మనకు కనిపిస్తుంటారు. అదే ప్రజాధనం లక్షల్లో కాజేసిన అక్కడ ప్రజాధనం వృధా అయిందని ప్రజలే వచ్చి ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన అప్పుడు ఇప్పుడు అంటూ కాలం వెళ్ళదిస్తూ గురువారం డి ఆర్ డి ఓ జిల్లా అడిషనల్ పిడి జూలపల్లి అటవి ప్రాంతాన్ని తనిఖీలు చేపట్టారు. గతంలో దాదాపుగా 14 ఎకరాలలో అటవీ ప్రాంతంలో ఉపాధి హామీ పథకం కింద మొక్కలు నాటి రూ7 లక్షలు కాజేశారని, ఆ ప్రాంతంలో నాటిన మొక్కలను తొలగించి కొత్త మొక్కలు పెట్టేందుకు సన్నతమవుతున్నారని ప్రజలు ఇటీవల ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దీంతోపాటు విజయకాంత్ దినపత్రిక కూడా ఈ ప్రాంతంలో జరిగిన అక్రమాలను వెలుగులోకి తీసుకువచ్చింది.

అప్పుడు ఇప్పుడు అంటూ కాలం వెళ్లదీసిన అధికార యంత్రాంగం ఎట్టకేలకు గురువారం జూలపల్లి అటవీ ప్రాంతంలో నాటిన మొక్కల ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ ప్రాంతంలో గతంలో కూలి చేసి మొక్కలు నాటిన కూలీలకు సైతం ఇప్పటివరకు కూలీలు అందలేదంటే అవినీతి అక్రమాలు ఏ మేరకు జరుగుతున్నాయో ఒక్కసారి అధికారులు సైతం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉపాధి హామీ పథకం అంటేనే నిరుపేదలకు ఉపాధి చూపించి వారికి భరోసానిస్తూ కూలి డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఇప్పుడు అంటూ కాలం వెళ్లి తీయడంతో ఉన్నత అధికారులు విచారణ చేసినప్పటికీ డ్రా చేసిన నిధులు రాబట్టడంతో పాటు కూలి డబ్బులు అందలేని ఉపాధి హామీ కూలీలకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని గ్రామస్తులు కోరుతున్నారు. 

సమగ్ర విచారణ జరిగేనా..?

సమగ్ర విచారణ జరిగే అవకాశాలు ఉన్నాయా అనే సందేహం జూలపల్లి గ్రామస్తులు నెలకొంది. తప్పులు ఎక్కడ జరిగిన అధికారులు పర్యవేక్షణ చేసి వాటిని వెలిగి తీసి సక్రమం చేసే పరిస్థితులకు కాలం చెల్లిందని గ్రామస్తులు వెళ్లి ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన చాలా రోజుల తర్వాత అధికారులు ఇక్కడికి వచ్చి విచారణ చేస్తున్నారని ఈ విచారణలో కూడా పూర్తిస్థాయిలో న్యాయం జరుగుతుందా అనే ప్రశ్నలు వారు లేవనెత్తుతున్నారు.

నాటిన మొక్కలు ఎన్ని కూలీలు ఎంతమంది పనిచేశారు ఎంత ప్రదేశంలో ఈ మొక్కలు నాటారు తొలగించారు అనే సమాచారం అధికారులు పూర్తిస్థాయిలో చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. దీంతోపాటు నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటారా కేవలం విచారణ పేరుతోనే కాలం గడుపుతారా వేచి చూడాలి.

త్వరలో వివరాలు తెలుపుతాం..

 జూలపల్లి అడవి ప్రాంతంలో నాటిన మొక్కల ప్రదేశాన్ని పూర్తిస్థాయిలో పరిశీలించాం. అన్ని వివరాలు పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఎక్కడ ఎలాంటి తప్పిదం జరిగిందో పూర్తి వివరాలు సేకరించి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు ఉన్నత అధికారులకు నివేదిక అందజేస్తాం. ప్రజాధనాన్ని తప్పుదోవ పట్టిస్తే ఊరుకునే పరిస్థితి ఉండదు. బాధ్యులపై చర్యలు తప్పవు.

- వామన్ రావు, డి ఆర్ డి ఓ అదనపు పిడి, మహబూబ్ నగర్