calender_icon.png 19 September, 2025 | 5:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల్లో చర్చించి పథకాలు అమలు చేయడమే లక్ష్యం: మంత్రి పొంగులేటి

11-07-2024 01:43:57 PM

ఉట్నూర్ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లో రైతు భరోసా కన్సల్టేషన్ వర్క్ షాప్ నిర్వహించారు. మంత్రివర్గ ఉపసంఘం ఆధ్వర్యంలో రైతుభరోసాపై అభిప్రాయాలను సేకరిస్తున్నారు. రైతు భరోసా అమలుకు రైతుల నుంచి అభిప్రాయాల సేకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క పాల్గొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి రైతులు తరలివచ్చారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత- చేవెళ్ల నిర్మాణం, చిన్న రైతుల కోసం పథకాల రూపకల్పనకు ప్రభుత్వం యోచిస్తోందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. పథకాలపై ప్రజల్లో చర్చించి అమలు చేయడమే లక్ష్యమన్నారు. అసెంబ్లీలో చర్చించి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని పొంగులేటి పేర్కొన్నారు. అందరి అభిప్రాయాలు తీసుకోవాలనే రైతు భరోసా సదస్సులు ఏర్పాటు చేసినట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రైతుల అభిప్రాయాల మేరకు ప్రభుత్వ నిర్ణయం తీసుకుంటోందని వెల్లడించారు.