అభివృద్ధి, సంక్షేమం రెండింటిని జోడెద్దులా ముందుకు తీసుకువెళతున్నాం
గత పాలకులు రాష్ట్రం పై 8.19 లక్షల కోట్ల అప్పులు మిగిలిపోయారు
ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చుతున్నాం: మంత్రి పొంగులేటి
వనపర్తి,(విజయక్రాంతి): గత పాలకులు 10 సంవత్సరాల్లో 8.19 లక్షల కోట్ల అప్పు భారం చేసి వెళ్లినప్పటికీ ఈ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ ను నెరవేర్చుతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy ) అన్నారు. శనివారం వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సహచర మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, స్థానిక శాసన సభ్యులు తుది మేఘా రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తో కలిసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం పైన ఇన్ని అప్పులు ఉన్నా ప్రతి నెల చేసిన అప్పులకు వడ్డీ చెల్లిస్తూనే అభివృద్ధి, సంక్షేమాన్ని జోడేద్దుల వలె ముందుకు తీసుకువెళుతున్నామని చెప్పారు. ప్రజల దీవెనలతో ఏర్పడిన ఇందిరమ్మ ప్రభుత్వం అసలు ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి అని ప్రజల చేత శభాస్ అని మెప్పులు పొందుతున్నారు. గత పాలకులు పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని చెప్పి మాట నిలబెట్టుకోలేదని, కనీసం సంవత్సరానికి 2 లక్షల ఇల్లు కట్టిన ఐదు సంవత్సరాల్లో 10 లక్షల ఇళ్లు కట్టేవారని కానీ వారికి పేదల సంక్షేమం కంటే కమిషన్లే ముఖ్యమని కాలేశ్వరం కట్టారని దుయ్యబట్టారు.
నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల పురోగతిలో ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి
రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల సందర్భంగా వనపర్తి నియోజక వర్గంలో తూడి మేఘా రెడ్డిని గెలిపిస్తే వనపర్తి నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటా అని మాట ఇచ్చారని, ఇచ్చిన మాట ప్రకారం నియోజక అభివృద్ధి కొరకు ఇప్పటికే రూ. 1000 కోట్లు ఒకసారి మరోసారి 280 కోట్లు మంజూరు చేయగా పనులు పురోగతిలో ఉన్నట్లు ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి తెలిపారు. అభివృద్ధి పరంగా రాష్ట్రంలో పాలేరు నియోజకవర్గం తర్వాత అంతటి ప్రాధాన్యత వనపర్తి నియోజకవర్గానికి కల్పించాలని మంత్రిని కోరారు. ప్రాంతంలో గిరిజనులు అధికంగా ఉన్నందున ఇందిరమ్మ ఇల్లు అదనంగా మంజూరు చేయాలని మంత్రిని కోరారు.
లబ్ధిదారులకు బట్టలు పంపిణీ
మంగంపల్లిలో ఈరోజు ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు చేసిన లబ్ధిదారులకు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వం తరపున లబ్ధిదారులకు బట్టలు పెట్టగా స్థానిక శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి వ్యక్తిగతంగా లబ్ధిదారులకు బట్టలు పెట్టారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్ ఖీమ్య నాయక్, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ యాదయ్య, మార్కెట్ కమిటి చైర్మన్ పి. శ్రీనివాస్ గౌడ్, పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






