22 June, 2026 | 9:56 PM

కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి.. బీఆర్ఎస్ పార్టీలోకి చేరిక

06-09-2025 03:00 PM

బాన్సువాడ, (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని 16వ వార్డు సిద్ధిగలికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి శ్రీనివాస్ (వేణు) యాదవ్(Ward Congress Party Incharge Venu) టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) సమక్షంలో, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలోకి చేరారు. ఈయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుండి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం పట్ల నిరాశకు గురైనట్లు ఆయన తెలిపారు. టిఆర్ఎస్ ప్రభుత్వం గతంలో 10 సంవత్సరాల పాటు ప్రజలకు రైతులకు అనేక పథకాలు అందజేసి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం పట్ల ఆకర్షితునై తిరిగి బిఆర్ఎస్ పార్టీలోకి చేరినట్లు నేను తెలిపారు. 16వ వార్డులో కూడా బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేసిన కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఆయనతోపాటు పత్తి రాజు మరో 10 మంది యువకులు పార్టీలోకి చేరారు.