విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రి పొన్నం
కొత్తపల్లి, జూన్ 24:తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తూ విద్యా వ్యవస్థను పటిష్ట పరుస్తున్న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కృషి చాలా అభినందనీయమని ఇతర రాష్ట్రాలకు సైతం ఆదర్శనీయమని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని ‘అల్ఫోర్స్‘ విద్యాసంస్థల అధినేత & విఎన్‌ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ వి.నరేందర్ రెడ్డి తెలిపారు.
అదే విధంగా మంత్రివర్గంలో తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటూ నియోజకవర్గ అభివృద్ధికి ఎన్నో విశిష్టమైన సేవలను అందిస్తూ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంటున్న రవా ణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రిప్రభాకర్ గౌడ్ హు స్నాబాద్‌లో ప్రతిపాదిత ఇంజనీరింగ్ కళాశాలలో కోర్సులు కేటాయింపుకై అహర్నిశలు కృషిచే సి కోర్సుల అమలను పరచడానికి ప్రణాళికలు రూపొందించడం హర్షించదగ్గ విషయమని ఆ న్నారు. కరీంనగర్ లో ఉన్న ప్రతిష్టాత్మక శాతవాహన యూనివర్సిటీకి సైతం లా కోర్సులను ప్రవేశపెట్టడానికి చేసిన కృషి అభినందనియ మనిఅన్నారు.






