ఉచిత వైద్య శిబిరానికి భారీ స్పందన
15-06-2026 05:25 PM
జన్నారం,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పొనకల్ గ్రామంలో సర్పంచ్ జక్కు సుష్మ భూమేష్ ఆధ్వర్యంలో సోమ వారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిభిరాని భారీ స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై పరీక్షలు చేయించుకున్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ ఉమశ్రీ పలు సూచనలు చేశారు. మానవ జీవితంలో వ్యక్తిగత పరిశుభ్రత అత్యంత ముఖ్యమైందని, పరిశుభ్రతను పాటించడం వల్ల అనేక రకాల ప్రాణాంతక వ్యాధుల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చని సూచించారు. శిబిరానికి వచ్చిన వారికి పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు పంపిణీ చేశారు.






