15 June, 2026 | 6:06 PM

పేకాట రాయుళ్ల అరెస్ట్.. నగదు స్వాధీనం

15-06-2026 05:18 PM

సదాశివనగర్,(విజయక్రాంతి): మండలంలోని మూడేగాం గ్రామ శివారులో  సోమవారం పేకాట ఆడుతున్న ఆరుగురుని అదుపులోకి తీసుకున్నట్టు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు.విశ్వసనీయ సమాచారం మేరకు సదాశివనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోడేగావ్ గ్రామ శివారులో పేకాట నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడి నిర్వహించి ఆడుతున్న ఆరుగురుని అదుపులోకి తీసుకోని, వారి వద్ద నుండి రూ.35,700 నగదు, ఐదు మొబైల్ ఫోన్లు, నాలుగు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నాట్లు ఎస్ఐ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి, తదుపరి విచారణ కొనసాగుతోంది.