దరఖాస్తుల స్వీకరణ
15-06-2026 05:15 PM
ఖానాపూర్,(విజయక్రాంతి): జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ పదవుల కోసం జిల్లా కేంద్రంలో సోమవారం పార్టీ ఇంచార్జ్ హుస్సేన్ ఆశావాదల నుంచి దరఖాస్తులను సేకరించినట్టు పార్టీ నాయకులు తెలిపారు. జిల్లా మైనార్టీ అధ్యక్ష పదవితో పాటు ఇతర పదవుల కోసం అర్హులైన వారి నుండి దరఖాస్తుల స్వీకరించి పార్టీ అధిష్టానానికి పంపనట్లు తెలిపారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి పదవులు దక్కిన చూస్తానని ఆయన హామీ ఇచ్చినట్టు దరఖాస్తుదారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మొహమ్మద్ అబ్దుల్ మతిన్, అహడ్ అహ్మద్, ఖిజర్, అహటేషం వీరు అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది






