15 June, 2026 | 6:10 PM

Breaking News

ప్రకృతి పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న డంపింగ్ యార్డ్ ను వెంటనే తొలగించండి   •   ప్రోగ్రాం, ఫార్మసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి   •   ప్రజావాణికి 93 దరఖాస్తులు   •   సత్వర న్యాయానికే లోక్ అదాలత్ లు   •   ధర్మపురి బస్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు   •   నాగారం గ్రామస్తులతో మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఆత్మీయ భేటీ   •   నాగారం మహాదేవుని ఆలయంలో తహసీల్దార్ వరలక్ష్మికి ఘన స్వాగతం   •   ఉజ్వల భవిష్యత్తుకు తొలిమెట్టు అంగన్వాడి కేంద్రాలు   •   యోగా ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యం   •   దత్తతతో చిన్నారుల జీవితాల్లో వెలుగులు   •  

బొట్టు పెట్టి.. స్వీట్లు తినిపించి...

15-06-2026 05:23 PM

- విద్యార్థులకు స్వాగతం పలికిన ఉపాధ్యాయులు

జన్నారం,(విజయక్రాంతి): నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సోమవారం సందడి వాతావరణం నెలకొంది. విద్యార్థులు బొట్టు పెట్టి.., పూలు అందజేసి.. మిఠాయిలు తినిపించి పాఠశాలలకు వచ్చిన విద్యార్థులకు ఆయా పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, సర్పంచులు స్వాగతం పలికారు. నూతనంగా చేరిన విద్యార్థులను అభినందించారు. విద్యార్థులకు ప్రభుత్వం సరఫరా చేసిన ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌ పుస్తకాలను ఈ సందర్భంగా అందజేశారు. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టి ప్రయోజకులు కావాలని కోరారు.