మంత్రి పొన్నం ప్రభాకర్‌ను బర్తరఫ్ చేయాలి
యాదవ జేఏసీ డిమాండ్
పంజాగుట్ట, ఏప్రిల్ 15 (విజయక్రాంతి): పేద రైతుల భూములను అక్రమంగా లాక్కుంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్ను తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని యాదవ జేఏసీ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. సిద్దిపేట పట్టణంలోని రంగధాంపల్లి గ్రామంలో సర్వే నంబర్లు 974 నుంచి 1006 వరకు గల సుమారు 42 ఎకరాల భూమిని 1960 నుం చి రాగం మల్లయ్య వారసులు సాగు చేసుకుంటున్నారని తెలిపారు.
దశాబ్దాలుగా సాగులో ఉండి, రైతుబంధు పొందుతున్న ఈ భూమిపై కన్నేసిన మంత్రి తన రాజకీయ పలుకుబడితో సంబంధం లేని వ్యక్తులతో కుహనా ఫిర్యాదు లు చేయించారని ఆరోపించారు. ఈ సమావేశంలో యాదవ జేఏసీ చైర్మన్ దాసరి అజయ్ యాదవ్, అధ్యక్షులు సిద్ది రమేష్ యాదవ్, ఇతర ముఖ్య నాయకులు, ఓయూ బీసీ విద్యార్థి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.






