05-12-2024 11:46:25 PM
మలక్‌పేట: జైల్‌లలో శిక్షా అనుభవిస్తున్న ఖైదీల్లో మానసిక, శారీరక పరివర్తన తీసుకొచ్చి వారి శిక్షా కాలం పూర్తయ్యేలోపు సమాజంలో సత్ప్రవర్తనతో మెలిగే విధంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జైలు అంటే ఖైదీలు అని ఊహించుకుంటాం, జైలు అంటే శిక్షను అమలు చేయడమే కాకుండా ఖైదీల్లో పూర్తిగా పరివర్తన తీసుకొచ్చే కేంద్రంగా రూపాంతరం చెందాలని అన్నారు. గురువారం చంచల్‌గూడ సెంట్రల్ జైల్‌లో సికా పెరేడ్ గ్రౌండ్ లో జైల్ ట్రైనేఈ వార్డర్స్ దీక్షాంత్ పెరేడ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ పెరేడ్‌లో గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ జైళ్లలో పూర్తిగా సంస్కరణలు తీసుకొచ్చి ఎన్నో మార్పులకు శ్రీకారం చేశామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉద్యోగ నియామకాల్లో ఏడాది కాలంలోనే 55,143 మంది కి నియామక ఉత్తర్వులను అందజేసిన ఘతనత తమ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. జైళ్ల శాఖలో 92 మంది జైల్ వార్డర్స్ సికా హైదరాబాద్‌లో శిక్షణ పొందారని, ఇందులో 84 మంమది పురుషులు, 8 మంది మహిళలు ఉన్నారన్నారు. రాష్ట్రంలో నుంచి కాకుండా అండమాన్ నికోబార్ కి చెందిన జైల్ వార్డర్స్ కూడా సికాలో బేసిక్ ఇండక్షన్‌లో శిక్షణ పొందారన్నారు. పాసింగ్ ఔట్ పెరేడ్ తీసుకుంటున్న జైల్ వార్డర్స్, డిప్యూటీ వార్డర్స్‌కి శుక్షాకాంక్షలు తెలిపారు. దేశ రక్షణలో బాధ్యత గల విధి నిర్వహణలో నిబద్ధతతో పని చేయాలన్నారు. శిక్షణ పొంది ప్రతిజ్ఞ చేసిన విధంగా సమాజంలో మీరు చేసే పనిని సమర్ధ ంతంగా నిర్వహించాలన్నారు.
ఇటీవల 249 మంది సత్ప్రవర్తన గల ఖైదీలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ప్రొఫెషనల్ ఖైదీల పట్ల కఠినంగా వ్యవహరిస్తూ వారిలో మార్పు తీసుకరావాలన్నారు. ఖైదీలు వివిధ వృత్తులో నైపుణ్యం సాధించి వారు తయారు చేసిన వస్తువులను స్టాల్స్ లో విక్రయించడం ద్వారా వారికి ఆర్థికంగా ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జైళ్ల శాఖ 29 పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే అనేక మార్పులకు శ్రీకారం చుట్టామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులోని ప్రధాన ఆకాంక్ష నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలకు పెద్ద పీట వేశామన్నారు. శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన జైల్ వార్డర్స్ కి మెడల్స్ ను ప్రధానం చేశారు. కార్యక్రమంలో హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్త, జైళ్ల శాఖ డీజీ సౌమ్యా మిశ్ర తదితర ఉన్నాతాధికారులు పాల్గొన్నారు.