calender_icon.png 11 November, 2025 | 10:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానుకోటలో దొంగల హల్‌చెల్

05-12-2024 11:32:30 PM

పట్టపగలే తాళలు పగుల కొట్టి చోరి

మహబూబాబాద్,(విజయక్రాంతి): మానుకోటలో దొంగలు హల్‌చెల్ చేశారు. పట్ట పగలే ఇండ్లలోని తాళాలు పగలకొట్టి సొత్తు దోచేశారు. వివరాల్లోకి వెళితే మహబూబాబాద్ జిల్లా పట్టణ కేంద్రంలో గురువారం కొన్ని తాళాలు వేసిన ఇండ్లలో మధ్యాహ్నం సమయంలో తాళాలు పగల కొట్టి ఆరు తూలాల వెండి, బంగారు అభరణాలు, నగదు పట్టికెళ్లినట్లు సమాచారం. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని క్లూస్ టీంతో ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.