11-11-2025 09:22:36 AM
హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక(Jubilee Hills Assembly by-elections) పోలింగ్ మంగళవారం ఉదయం 7 గంటలకు గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రారంభమైంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో షేక్‌పేట డివిజన్‌లోని పోలింగ్ బూత్-28లో ప్రముఖ సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి(Film director Rajamouli ) తన కుటుంబంతో కలిసి ఓటు వేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 4.01 లక్షలకు పైగా ఓటర్లు తమ ఓటర్లు 58 మంది అభ్యర్థుల ఎన్నికల అదృష్టాన్ని నిర్ణయించనున్నారు. అధికార కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. మొత్తం 407 పోలింగ్ కేంద్రాలలో 226 పోలింగ్ కేంద్రాలను క్లిష్టమైనవిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్ నగర్, యూసుఫ్‌గూడ, షేక్‌పేటలోని పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు భారీగా తరలివచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతుందని ఎన్నికల అధికారి కర్ణన్ పేర్కొన్నారు.
6 పోలింగ్ కేంద్రాల్లో సమస్యలు తలెత్తాయి.. సెట్ చేశాం.. గతంలో కంటే 40 పోలింగ్ కేంద్రాలు పెంచామని కర్ణన్ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో చలి వాతావరణం మధ్య పోలింగ్ మందకొడిగా ప్రారంభమైంది. అనేక బూత్‌లలో ఓటర్ల సంఖ్య తక్కువగా ఉంది. బోరబండలోని బూత్ నంబర్ 337 వద్ద ఉద్రిక్తత చెలరేగింది. కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ గుర్తు గల టీ-షర్టులు ధరించి లోపల ప్రచారం చేశారని బీఆర్ఎస్ ఆరోపించింది. సత్తుపల్లి ఎమ్మెల్యే భర్త దయానంద్ పై బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. స్థానికేతర వ్యక్తి జూబ్లీహిల్స్ వెంగళ్‌రావు నగర్ డివిజన్ ఉన్నారని ఆర్ వోకు ఫిర్యాదులో తెలిపింది. వెంగళరావునగర్ పోలింగ్ బూత్ వద్ద సత్తుపల్లి ఎమ్మెల్యే భర్త ఉండడంతో బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. పలు పోలింగ్ కేంద్రాల వద్ద స్థానికేతరులు ఉన్నారంటూ బీఆర్ఎస్ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసింది. స్థానికేతరులు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.