calender_icon.png 4 August, 2025 | 12:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దివ్యాంగున్ని హత్య

05-12-2024 11:49:47 PM

మలక్‌పేట: ఓ దివ్యాంగుని తల పై గంజాయి విక్రేత మరో వ్యక్తి కలిసి గ్రనైట్ రాయితో మోది హత్య చేసిన సంఘటన చాదర్‌ఘాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చాదర్‌ఘాట్ పరిసర ప్రాంతాల్లో అఖిల్(24) అనే దివ్యాంగుడు భిక్షాటన చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. కాగా, గురువారం రాత్రి ఆజంపురా లో స్థానికంగా గంజాయి అమ్మకాలు సాగిస్తున్నా ముస్తఫా అననే గాంజా వ్యాపారి పై అఖిల్ ఘర్షణపడ్డాడు.ఈ క్రమంలో గాంజా వ్యాపారి, మరో వ్యక్తి తో కలిసి గ్రనేట్ రాతితో అఖిల్ తల పై బాదడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. చాదర్‌ఘాట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నింధితుడు ముస్తఫా పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. సంఘటన స్థలాన్ని సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ కాంతిలాల్ పాటిల్, అడిషనల్ డీసీపీ స్వామీ, ఏసీపీ శ్యాంసుందర్ సందర్శించి ఘటన వివరాలను సేకరించారు.