30-07-2024 02:11:40 AM
గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీహరి యాదవ్
ముషీరాబాద్, జూలై 29: తెలంగాణ మంత్రివర్గంలో గొల్ల కురుమలకు అవకాశం కల్పించాలని గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోచబోయిన శ్రీహరి యాదవ్, ప్రధాన కార్యదర్శి మారం తిరుపతి యాదవ్ డిమాండ్ చేశారు. సోమ వారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో వారు మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సమ యంలో కాంగ్రెస్ పార్టీ యాదవులకు రూ.10 వేల కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. గొల్ల కురుమలకు రాజ కీయ అవకాశాలు, బడ్జెట్‌లో కేటాయింపులు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఆగస్టు 15వ తేదీలోపు గొల్ల కురుమలకు ఎలాంటి అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందిస్తారో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేయాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసన దీక్షలు చేపడతామని తెలిపారు. సమావేశంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి ఉప్పరి శ్రీనివాస్, సిద్దిపేట, మెదక్ జిల్లాల అధ్యక్షులు వెంకటేశ్ యాదవ్, దేవరాజు యాదవ్, పెద్దపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాములు, చంద్రమౌళి పాల్గొన్నారు.