21 March, 2026 | 12:36 PM

నవోదయకు ఎంపికైన పోకల తనుష్

21-03-2026 10:59 AM

జగదేవపూర్, (విజయక్రాంతి): జగదేవపూర్ మండల పరిధిలోని ఎంపీపీ ఎస్ వెంకటాపూర్ బిజి పాఠశాల విద్యార్థి పోకల తనుష్ జవహర్ నవోదయ విద్యాలయం వర్గల్-2026 సంవత్సరానికి ఆరవ తరగతికి సెలెక్ట్ అయ్యారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాత్లావత్ బొద్దు నాయక్ తెలిపారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు బొద్దు నాయక్ ,జెడ్ పి హెచ్ ఎస్ మునిగడప కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు క్యాసారం కనకయ్య విద్యార్థి పోకల తనుష్ ను సన్మానించితల్లితండ్రులను అభినందించారు.

ఈ సందర్భంగా జెడ్ పి హెచ్ ఎస్ మునిగడప కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కనకయ్య మాట్లాడుతూ విద్యార్థులు తనుష్ లాగా మంచిగా కష్టపడి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని అన్నారు.పోటీ పరీక్షలలో విజయం సాధించాలని తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి పేరు తేవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో  ఉపాధ్యాయులు కరుణాకర్ రెడ్డి, స్వరూప,సీఆర్ పి రమణ,విద్యార్థి తండ్రి పోకల రాజు  విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.