హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆరోవ రోజు కొనసాగుతున్నాయి. మరో 19 పద్దులపై శాసనసభలో చర్చ కొసాగుతుంది. ఈ సందర్భంగా స్కిల్స్ యూనివర్సిటీ బిల్లును పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మంగళవారం ప్రవేశపెట్టారు. విద్యార్థులకు సమగ్ర నైపుణ్య శిక్షణ మరియు ఉద్యోగ అవకాశాలను అందించడంపై దృష్టి సారించి, ప్రైవేట్ సంస్థల సహకారంతో ప్రతిపాదిత నైపుణ్యాల విశ్వవిద్యాలయం స్థాపించబడింది. నిన్నటిలా సుదీర్ఘ ప్రసంగాలు చేయవద్దని సభ్యులకు అసెంబ్టీ సభాపతి మనవి చేశారు. సబ్జెక్ట్ పైనే మాట్లాడాలని సభ్యులందరికీ విజ్ఞప్తి చేశారు.