11 March, 2026 | 9:20 PM

కల్యాణలక్ష్మి,షాదీముబారక్ చెక్కుల పంపిణీ చేసిన మంత్రి సీతక్క

25-12-2025 12:00 AM

ఏటూరునాగారం,డిసెంబర్24(విజయక్రాంతి):ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఐటిడిఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మి,షాది ముభారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమములో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా,మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క పాల్గొని ఐటీడీఏ పీఓ చిత్ర మిశ్రా, అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి లతో కలసి కన్నాయిగూడెం మండల పరిధిలోని 10మంది, ఏటూరునాగారం మండల పరిధిలోని 28మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.

అనంతరం ఏటూరునాగారం మండల కేంద్రంలోని వై జంక్షన్ వద్ద ఉన్న బిఆర్ ఫంక్షన్ హాల్ లోఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషమని క్రిస్టియన్ మతానికి చెందిన వారికి జిల్లా ప్రజలకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.