25-12-2025 12:00:00 AM
చర్ల,దుమ్మగూడెం/ డిసెంబర్ 24, (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇల్లు రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులకు అంద డం, మరికొన్ని ప్రాంతాలలో లబ్ధిదారులు నష్టపోతున్నారు అంటూ వాపోతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం పెదనల్లబెల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు విషయంలో అవకత వకలు జరిగాయి. ఇల్లు ఒకరిది బిల్లు మరొకరిది అన్నట్లుగా ఉంది.
గ్రామంలో ఇద్దరు పేర్లు ఒక్కటే కావడం, ఒకరికి మంజూరైన ఇందిరమ్మ ఇళ్లు, మరొకరు నిర్మించుకోవ డం,దానికి సంబంధించిన బిల్లు నిర్మించినోళ్లకు కాకుండా, మంజూరైన వారి ఎకౌంట్లో జమ కావడం దుమ్ముగూడెం మండలంలో చోటుచేసుకుంది. ఇక్కడ పంచాయతీ కార్యదర్శి గా పనిచేసే ఎ.మల్లికార్జున రావు నిర్వా హకం కారణమని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. మట్ట ముత్తయ్య భార్య భద్రమ్మ కు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది .
అదే పేరు గల మట్ట ముత్తయ్య భార్య రాజమ్మ కు పంచాయతీ కార్యదర్శి మల్లికార్జున రావు ఇందిరమ్మ ఇల్లు కట్టివ్వడం జరిగింది. కానీ ఈ ఇందిరమ్మ ఇల్లుకు సం బంధించిన బిల్లు మాత్రం అసలు మంజూరైన మట్ట ముత్తయ్య భార్య భద్రమ్మ ఎకౌం ట్లోనే పడింది. సదరు పంచాయతి కార్యదర్శి నిర్వాహకంతో ఇల్లు ఒకరిది... బిల్లు మరొకరిది అన్నట్లు అయింది. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం, తప్పిదం కారణంగా లబ్ధిదారులు అయోమయంలో పడ్డారు.
దీంతో అసలు ముత్తయ్యకు అన్యాయం జరిగిందని అర్థమై జరిగిన తప్పిదంపై బాధితుడు లబోదిబోమంటూ పాత్రికేయుల ముందు తన గోడు వెళ్ళబుచ్చారు. దీంతో విషయం వెలుగులో కి వచ్చింది. అయితే సదరు కార్యదర్శి అస లు ఇల్లు మంజూరు అయిన ముత్తయ్య ను రహస్యంగా పిలిచి తెల్ల పేపర్ పై సంతకం చే యించినట్లు కూడా ముత్తయ్య చెప్పుకొచ్చా డు, మరి ఇప్పుడు కట్టిన ఇల్లు ఎవరిది .?పడ్డ బిల్లు ఎవరిది ? అనేది పెద్ద సమస్యగా మా రింది.
జరిగిన అన్యాయాన్ని కార్యదర్శిని వివరణ అడగగా టెక్నికల్ ఇష్యూ అంటూ జరిగి న తప్పిదాన్ని ప్రభుత్వం పై నేట్టి తప్పించుకునే ప్రయత్నం చేశారు. తనకు వచ్చిన ఇల్లు ను తనకు కట్టించే విధంగా చర్యలు తీసుకోవాలని ముత్తయ్య ప్రభుత్వా అధికారులను వేడుకుంటున్నాడు, బ్యాంక్ అకౌంట్ , ఆధా ర్‌కార్డు నమోదు కచ్చితంగా తీసుకొని ఉంటే ఇలాంటి సమస్య వచ్చేది కాదని గ్రామ ప్రజ లు మండిపడుతున్నారు, అధికారులు ఎలాంటి న్యాయం చేస్తారో వేచి చూడాలి.