calender_icon.png 25 December, 2025 | 5:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్‌ఐ అత్యుత్సాహం మహాదేవపూర్ పర్యటనలో జర్నలిస్టుతో దురుసు ప్రవర్తన

25-12-2025 12:00:00 AM

మహాదేవపూర్, (విజయక్రాంతి):తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మహాదేవపూర్లో పర్యటించిన సందర్భంగా ఓ నాయకుడిని మం త్రి మందలిస్తున్న తరుణంలో, మహా ము త్తారం పోలీస్ స్టేషన్ ఎస్త్స్ర మహేందర్ అతి ఉత్సాహం ప్రదర్శించిన ఘటన చోటుచేసుకుంది.వార్త సేకరిస్తున్న సమయంలో ఓ జ ర్నలిస్టు కెమెరాను ఎస్త్స్ర మహేందర్ నెట్టివేయడంతో అక్కడున్న పలువురు జర్నలిస్టులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

మీడియా స్వేచ్ఛపై ఇలాంటి చర్యలు తగవని వారు పేర్కొన్నారు.ఈ ఘటనపై ఎస్త్స్రపై తక్షణమే చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో మీడియాకు ఉన్న హక్కులను కా పాడాల్సిన బాధ్యత పోలీస్ అధికారులదేన ని, జర్నలిస్టుల పనిలో అడ్డుపడటం అనుచితమని వారు స్పష్టం చేశారు.ఈ ఘటనపై ఉ న్నతాధికారులు స్పందించి, ఎస్త్స్ర మహేంద్ప విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు వర్గాలు కోరుతున్నాయి.