calender_icon.png 2 February, 2026 | 3:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదివాసి బిడ్డను.. పారిపోను

02-02-2026 01:33:50 AM

ప్రజల కోసం, భక్తుల కోసం పంతం నెగ్గించుకుంటా

మేడారం జాతర దిగ్విజయాన్ని జీర్ణించుకోలేక నాపై చేసే కుట్రలకు భయపడ

మేడారంలో మీడియాతో మంత్రి సీతక్క

మేడారం, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): మేడారం మహా జాతర సందర్భంగా తనపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. మనసా వాచా కర్మణా చిత్తశుద్ధితో ఆదివాసీల అస్తిత్వం, ఆత్మగౌరవం కోసం పరితపించే ఆదివాసి బిడ్డను తాను అని పేర్కొన్నారు. తాను పారిపోయే రకం కాదని, భక్తులు, ప్రజల కోసం పంతం నెగ్గించుకునే రకమని స్పష్టం చేశారు. ఆదివారం మేడారంలో నిర్వహించిన మీడియా సమావేశం లో ఆమె మాట్లాడారు. ఆదివాసి అస్తిత్వం, తల్లుల పట్ల అచంచల భక్తి తన జీవన విధానమని, మేడారం జాతర దిగ్విజయాన్ని జీర్ణించుకోలేక కొందరు చేసే కుట్రలకు భ యపడబోనని మంత్రి తెలిపారు.

జాతరను విజయవంతంగా నిర్వహించినట్లే, జాతర అనంతరం చేపట్టాల్సిన పనులన్నీ సమర్థం గా పూర్తి చేస్తున్నామని చెప్పారు. ఐదువేలకు పైగా పారిశుద్ధ్య సిబ్బందిని నియమించి మేడారం పరిసరాలను పూర్తిగా పరిశుభ్రం చేస్తున్నామని, రేయింబవళ్లు కష్టపడి పనిచేసిన పోలీస్ సిబ్బందికి అభినందనలు తెలి పారు. ఘట్టమ్మ దేవాలయం వద్ద ట్రాఫిక్ జామ్ లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని, ఘట్టమ్మ దర్శనం అనంతరం సమ్మక్కకు వచ్చే సంప్రదాయం దృష్టి లో ఉంచుకుని అక్కడ సజావుగా రాకపోకలు కొనసాగించగలిగామని చెప్పారు.

ఈ సారి రోడ్డు ప్రమాదాలు జరగకుండా నివారించగలిగామని తెలిపారు. సమ్మక్కసారలమ్మల తో తమకు భావోద్వేగ బంధం ఉం దని, అందుకే ప్రతి విషయంలో అప్రమత్తంగా వ్యవహరించామని చెప్పారు. గుడి నిర్మాణ బాధ్యతను ప్రభుత్వం భుజాన వేసుకుందని, జాతరకు ముందే శాశ్వత నిర్మాణ పనులు పూర్తి కావడం వల్లే భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిందని తెలిపారు. గతంలో జాతరకు ముందు రోజుకు ఒకటి, రెండు లక్షల మంది మాత్రమే వచ్చేవారని, కొత్త గుడి నిర్మాణం అనంతరం ఒక్క రోజులోనే ఎనబై లక్షల మంది వరకు భక్తులు తరలివచ్చారని చెప్పారు. తాత్కాలిక ఏర్పాట్లకు బదులు శాశ్వత ఏర్పాట్లు చేయడం వల్లే ఈ రద్దీ సాధ్యమైందని వివరించారు. 

ముందస్తుగానే ఏర్పాట్లు

తాగునీరు, టాయిలెట్లు ముందస్తుగానే సిద్ధం చేశామని తెలిపారు. సమ్మక్కను సకాలంలో గద్దెలపైకి తీసుకురావడంలో పూజారులు సహకరించారని కృతజ్ఞతలు తెలిపారు. కొంతమంది కొత్త పోలీస్ సిబ్బం ది పూజారులను గుర్తించలేక పొరపాటు జరిగిందని, అది ఉద్దేశపూ ర్వకమైంది కాదని స్పష్టం చేశారు. క్యాబినెట్ ఒకరోజు మేడారంలోనే ఉండి నిర్ణయాలు తీసుకోవడం చరిత్రా త్మకమని మంత్రి పేర్కొన్నారు. శుక్రవారం వీఐపీ తాకిడి ఎక్కువగా ఉండటంతో కొందరు వీఐపీలు 30 నుంచి 40 వాహనాలతో రావడం వల్ల ట్రాఫిక్ సమస్య ఏర్పడిందని, ఆ సమయంలో కూ డా రాజకీయాలు చేయడానికి కొందరు ప్రయత్నిం చారని విమర్శించారు.

అయినా సాధారణ భక్తులు పూర్తి స్థాయిలో సహకరించడంతో పసర దారిలో ట్రాఫిక్ జామ్ లేకుండా నిర్వహించగలిగామని చెప్పారు. భక్తులు సజావు గా దర్శనాలు చేసుకుని ఆనందంతో తిరిగివెళ్లారని, కొంతమంది భక్తులకు కలిగిన అసౌక ర్యానికి ప్రభుత్వం చింతిస్తున్నదని తెలిపారు. ఈ జాతర అనుభవాల ఆధారంగా వచ్చే జాతరలో ట్రాఫిక్ జామ్ పూర్తిగా లేకుండా మరింత పటిష్ట చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తల్లుల జనప్రవేశం నుంచి వనప్రవేశం వర కు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా వ్యవహరించామని పేర్కొన్నారు. జాతరలో ప్రమాదాలు జరుగుతాయని కొందరు స్వామీజీలు ప్రచారాలు చేశారని, వనదేవతలపై ప్రజల్లో పెరుగుతున్న భక్తిని తట్టుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు.