30-05-2025 11:10:39 PM
ముత్తారం,(విజయక్రాంతి): రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలను ముత్తారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డ బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా దొడ్డ బాలాజీ మాట్లాడుతూ... నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష 60 ఏళ్ల తెలంగాణ కలను నెరవేర్చినటువంటి గొప్ప వ్యక్తి శ్రీధర్ బాబు అన్నారు. ఈ కార్యక్రమంల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు మద్దెల రాజయ్య, పిఎసిఎస్ చైర్మన్ అల్లాడి యాదగిరిరావు, యువజన కాంగ్రెస్ మండల మాజీ అధ్యక్షుడు బియ్యాని శివకుమార్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బక్కతట్ల వినీత్, వాజిద్ పాషా, అల్లం కుమారస్వామి కోలా విజయ్, తాటిపాముల శంకర్ తదితరులు పాల్గొన్నారు.