11-09-2025 03:20:08 PM
కోదాడ: విద్యార్థులు ఏకాగ్రతత చదవాలి అని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. గురువారం కోదాడ మండలం నల్లబండగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదవ తరగతి విద్యార్థుల మ్యాథ్స్ సబ్జెక్టు నోట్ పుస్తకాలను పరిశీలించారు. పదవ తరగతి పరీక్షలకు రైటింగ్ బాగా ప్రాక్టీస్ చేస్తేనే మంచి మార్కులు వస్తాయని సూచించారు.మీరు భవిష్యత్ లో ఏమి అవ్వాలని ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకొని చుదువు కుంటే కలిగే ప్రయోజనాలను విద్యార్థులకి తెలియజేసి ప్రోత్సాహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సూర్యనారాయణ, ప్రధాన ఉపాధ్యాయురాలు వసంత, ఉపాధ్యాయురాలు శైలజ, ఆర్ ఐ జగదీష్ తదితరులు పాల్గొన్నారు.