11-09-2025 02:51:12 PM
హైదరాబాద్: కాంగ్రెస్ లో విధాన పక్షవాతం ఎప్పటినుంచో ఉందని, తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన పక్షవాతం నెలకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు(Ramchander Rao) అన్నారు. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ మీట్ ది ప్రెస్(Telangana Journalist Union Meet the Press)లో పాల్గొన్న రామచందర్ రారు కాంగ్రెస్ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ లో ఇండియా కూటమికి ఐక్యత లేదని తెలిపోయిందన్నారు. గ్రూప్-1 అంశంలో న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని గుర్తుచేశారు. జబ్ క్యాలెండర్ ఏమైంది? అని ప్రశ్నించారు.
11 ఏళ్లుగా తెలంగాణలో కొత్తగా ఒక్క గ్రూర్-1 అధికారి కూడా నియామకం కాలేదని, గ్రూప్ వన్ అభ్యర్థుల పరిస్థితి చూస్తే ఎంతో బాధ కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. విశ్రాంత ఉద్యోగులకు 18 నెలలుగా బెనిఫిట్స్ రావట్లేదని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రొఫెసర్లకు జీతాలు రావడం లేదని, యూనివర్సిటీలు హాస్టళ్లు అధ్వానంగా మారయని ఆరోపించారు. ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించిన రేవంత్ రెడ్డి వెయ్యి కోట్లు ఇస్తానని గొప్పలు చెప్పారని మండిపడ్డారు. దావోస్ పర్యటనకు వెళ్లి ఎన్ని కోట్ల పెట్టుబడులు తెచ్చారో అని ప్రశ్నించారు.